
సాక్షి, చెన్నై: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ చిత్రం 2.ఓ. గతంలో ఘనవిజయం సాధించిన రోబో సినిమా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాది దీపావళి రోజున విడుదల కావాల్సిన ఈ చిత్రం సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా టీజర్ కూడా విడుదల కాకపోవడంతో నిరాశలో ఉన్న అభిమానుల కోసం తాజాగా ఓ శుభవార్త చక్కర్లు కొడుతోంది.
మే 27న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్‌లో 2.0 టీజర్‌ను విడుదల చేయనున్నారట. లైకా ప్రొడెక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రూ.400కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.