స్లిమ్‌ అవ్వడానికి పాట్లు | Rakul Preet Sing Workouts For NGK Movie | Sakshi
Sakshi News home page

స్లిమ్‌ అవ్వడానికి పాట్లు

Aug 15 2018 10:14 AM | Updated on Aug 15 2018 12:41 PM

Rakul Preet Sing Workouts For NGK Movie - Sakshi

తమిళసినిమా: కొందరు భామలకు బొద్దుగా ఉండడమే ముద్దు. మరికొందరు అమ్మాయిలు మాత్రం సన్నగా నాజూగ్గా ఉండటానికి నానా పాట్లు పడుతుంటారు. అందుకోసం నోరు కూడా కుట్టేసుకుంటారు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ తిండి విషయం ఏమోగానీ, స్లిమ్‌గా ఉండటానికి మాత్రం చాలా పాట్లు పడుతోంది. కోలీవుడ్‌లో నిరాశకు గురై టాలీవుడ్‌కు వెళ్లి అక్కడ అందం, అదృష్టం అందలమెక్కించడంతో క్రేజీ హీరోయిన్‌గా టపటపా అరడజనుకు పైగా చిత్రాలు చేసేసింది. ఆ తరువాత అక్కడ కాస్త అవకాశాలు దోబూచుటాడడంతో మళ్లీ కోలీవుడ్‌ను ఆశ్రయించింది. ఈ సారి ఇక్కడ ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం రూపంలో సక్సెస్‌ వరించింది. ప్రస్తుతం కార్తీతో మరోసారి దేవ్‌ అనే చిత్రంలోనూ, సూర్యకు జంటగా ఎన్‌జీకే చిత్రంలోనూ నటిస్తోంది.

అంతే కాదు శివకార్తీకేయన్‌తో ఒక చిత్రం చేసే అవకాశాన్ని దక్కించుకుంది. సూర్యతో నటించిన ఎన్‌జీకే చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆ చిత్ర రిజల్ట్‌ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న రకుల్‌  మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. నటన కంటే గ్లామర్‌నే ఎక్కువగా నమ్ముకున్న ఈ బ్యూటీ దాన్ని మరింత మెరుగు పరుచుకునేందుకు నానా పాట్లు పడుతోంది. హీరోహీరోయిన్లు బాడీని స్టిఫ్‌గా ఉంచుకోవడానికి ఎంచుకునే మార్గం కసరత్తులు. నటి రకుల్‌ కూడా అదే పనిలో ఉంది. ఈ భామ స్లిమ్‌గా తయారవ్వడానికి రోజు రెండు గంటల పాటు జిమ్‌లోనే ఉంటోందట. అంతే కాదు నన్ను చూడు నా అందం చూడు అన్న చందాన తన కసరత్తుల దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి ఉచిత ప్రచారం పొందేస్తోంది. ఈ ట్రిక్స్‌ ఈ అమ్మడికి ఎంత వరకు ఉపయోగపడతాయో చూడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement