హైదరాబాద్ : లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరమితమైన సెలబ్రిటీలు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు వర్క్ అవుట్స్‌లో బిజీగా ఉంటే మరి కొందరు వంట గదిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా హీరో రామ్‌చరణ్ కూడా కిచెన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన తల్లి, నాన్నమ్మ నుంచి వెన్న తీయడం నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రామ్‌చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ తన తల్లి సురేఖ, నాన్నమ్మ అంజనాదేవి పర్యవేక్షణలో వెన్న తీయడం పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేసేందుకు ప్రారంభించిన బి ది రియల్ మ్యాన్ చాలెంజ్‌ను రామ్‌చరణ్ విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇళ్లు క్లీన్ చేయడం, మొక్కలు నీళ్లు పట్టడంతోపాటుగా.. తన భార్య కాఫీ కూడా పెట్టి ఇచ్చారు. సినిమాల విషయానికి వస్తే.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మరో హీరో ఎన్టీఆర్‌తో కలిసి ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు.
చదవండి : ప్రేమలే కాదు పనులూ పంచుకుందాం
Comments
Please login to add a commentAdd a comment