
రంగస్థలం లాంటి సూపర్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. ప్రస్తుతం చిత్రకీరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.