వర్మ.. రాజమౌళి.. ఓ ట్విట్టర్ ఆట!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వ్యాఖ్య చేయకుండా ఊరుకోరు. అందులోనూ చేతిలో ట్విట్టర్ ఉంది.. ఇంక అడ్డేముంది? ఏదో ఒకటి అనకుండా ఉండలేని పరిస్థితి. తాజాగా ఇప్పుడు బాహుబలి విజయంతో మంచి ఊపుమీదున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మీద ఆయన కన్ను పడింది. రాజమౌళి మీద ఏం కామెంట్ చేద్దామా అనుకుంటున్న ఆయనకు రాజమౌళి ఇంటిపేరు గుర్తుకొచ్చింది.
ఎస్ఎస్ అంటే.. స్టీఫెన్ స్పీల్బెర్గ్ అంటూ ఓ కొత్త సిద్ధాంతం తెచ్చిపెట్టారు. తనకు ఈ విషయం ఇప్పుడే తెలిసిందంటూ ట్విట్టర్లో రాసిపారేశారు. దాంతో.. రాజమౌళి తలపట్టుకున్నారు. ''జనంతో నన్ను తిట్టించడానికి కాకపోతే అవసరమా సర్ ఇప్పుడిది'' అంటూ ఆయనకు సమాధానం పెట్టారు. మొత్తమ్మీద వాళ్లిద్దరి ట్విట్టర్ ఆట.. జనానికి మాత్రం మంచి సరదాను పంచిపెట్టింది.
I just now came to know that the SS in SS Rajamouli stands for Steven Spielberg
— Ram Gopal Varma (@RGVzoomin) September 8, 2015
@RGVzoomin janam tho nannu thittinchadaniki kaakapothe avasarama sir ippudu idhi