పవన్‌పై వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్
మెగా ఫ్యామిలీపై తరచుగా కామెంట్లు చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈసారి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌పై ట్వీట్ చేశాడు. పవన్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ నిజమైన హీరో అని తనశైలికి భిన్నంగా డైరెక్టర్ వర్మ సోషల్ మీడియాలో స్పందించాడు. ప్రజల సమస్యలపై సినిమాలతో పాటు బయట కూడా పోరాటం కొనసాగిస్తున్నందున ప్రపంచలోనే రియల్ హీరో పవన్ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు వర్మ. యువత ఇప్పుడు హోదా అంశాన్ని సీరియస్ అంశంగా తీసుకుంటే, భవిష్యత్తు తరాల్లో ఇలాంటి నీచ రాజకీయాలు చెయ్యాలంటే నేతలు భయపడాలని, జనసేన పోరాటం తాలూకు అంతిమ లక్ష్యం ఇదేనని పవన్ ట్వీట్ చేసిన గంటలోనే వర్మ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గళం విప్పారు. కేంద్రంపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పోరాటం కొనసాగిస్తే వెంటనే కాకపోయినా భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందంటూ పవన్ ప్రత్యేక హోదాకు తన మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందట కిడ్నీ సంబంధ వ్యాధులతో సతమతమవుతున్న ఉద్దానంలో పర్యటించి ఏపీ సర్కారులో కదలిక తీసుకొచ్చారు పవన్.