వర్మ.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్! | Ram Gopal Varma Tweets That Officer Is IPS Story | Sakshi
Sakshi News home page

వర్మ.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్!

May 17 2018 8:36 PM | Updated on Jul 15 2019 9:21 PM

Ram Gopal Varma Tweets That Officer Is IPS Story - Sakshi

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆఫీసర్. ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అంశాన్ని వర్మ వెల్లడించాడు. ఇది మూవీ స్టోరీ కాదని, నిజ జీవితంలో ఓ పోలీస్ అధికారి జీవిత కథాంశం అని తెలిపాడు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేస్తూ ఆ ఆఫీసర్ వివరాలు వెల్లడించాడు వర్మ.

‘కర్ణాటకకు చెందిన కేఎం ప్రసన్న ఓ ఐపీఎస్. ఆయనను ముంబైలోని ఓ పోలీస్ ఉన్నతాధికారి కేసును విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు చీఫ్‌గా నియమించారు. 2010లో ఐపీఎస్ నాతో వ్యక్తిగతంగా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. దాని ఆధారంగా తీసిన మూవీ ఈ ఆఫీసర్. ముంబై క్రైం బ్రాంచ్ ఏసీపీ (ప్రసన్న) పాత్రను నాగార్జున పోషించారు. ఐపీఎస్‌ షేర్ చేసుకున్న అంశాలను కథాంశంగా మలుచుకుని ఆఫీసర్ మూవీ తీశానంటూ’ వర్మ పలు ఆసక్తికర అంశాలు ట్వీట్‌ చేశాడు. సినిమాను మే 25న కాకుండా జూన్‌ 1న రిలీజ్‌ చేయాలని నిర‍్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement