
రామ్
అనగనగా నలుగురు స్నేహితులు. ఒక్కొక్కరది ఒక్కో రాష్ట్రం. అందరూ కలిసి ఒక యాక్షన్ అడ్వెంచర్ చేద్దామని డిసైడ్ అయ్యారు. మరి ఆ అడ్వెంచర్ ఎంటి? ఎక్కడికి వెళ్లారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు ప్రవీణ్ సత్తారు. ‘పి.యస్.వి గరుడ వేగ’ సినిమా తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ప్రవీణ్ సత్తారు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మాళవికా శర్మని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట.
ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో ఉండబోతోందని సమాచారం.రామ్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నారట. రామ్ స్నేహితులుగా బాలీవుడ్ నటుడు, ‘మేరీ కోమ్’ ఫేమ్ దర్శన్ కుమార్, మాలీవుడ్ నటుడు సంజు శివరాం కనిపించనున్నారని సమాచారం. ఇంకో స్నేహితుడి పాత్రలో కోలీవుడ్ టాప్ హీరోని ఓకే చేశారట. వీరందరూ ఈ సినిమాలో వాళ్ల మాతృభాషలోనే డైలాగ్స్ పలుకుతారట. స్రవంతి రవికిషోర్ నిర్మించ నున్న ఈ సినిమా మే ఫస్ట్ వీక్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment