హాలీవుడ్ తెరపై మరో భారతీయుడి జీవితకథ సందడి చేయనుంది. గణితశాస్త్ర మేధావిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను హాలీవుడ్లో సినిమాగా తెరకెక్కించారు. స్లమ్డాగ్ మిలియనీర్ ఫేం దేవ్పటేల్ రామానుజన్గా నటించిన ఈ సినిమాను టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు.
సామాన్యుడైన శ్రీనివాస రామానుజన్ మద్రాస్ నగరం నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వరకు ఆయన ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. మాథ్యూ బ్రౌన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దేవిక బైసే, దేవ్పటేల్కు జంటగా నటిస్తుంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రామానుజానికి సహాయం చేసే ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు జిహెచ్ హార్డీ పాత్రలో జెరెమీ ఐరన్స్ కనిపించనున్నాడు.
హాలీవుడ్లో భారతీయుడి జీవితగాథ
Published Wed, Sep 16 2015 12:38 PM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM
Advertisement
Advertisement