కెప్టెన్‌ అర్జున్‌ వర్మ | Rana's First Look in Ghazi | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ అర్జున్‌ వర్మ

Published Tue, Dec 13 2016 11:33 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

కెప్టెన్‌ అర్జున్‌ వర్మ - Sakshi

కెప్టెన్‌ అర్జున్‌ వర్మ

బాబాయ్‌ వెంకటేశ్‌.. అబ్బాయ్‌ రానా.. ఇద్దరూ ఒకేరోజు అభిమానులను ఖుషీ చేశారు. మంగళవారం వెంకటేశ్‌ పుట్టినరోజు కానుకగా ‘గురు’ టీజర్‌ విడుదల చేశారు. బుధవారం అబ్బాయ్‌ రానా పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్నే (మంగళవారం) ‘ఘాజీ’లో రానా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ రెండూ కొన్ని గంటల వ్యవధిలోనే విడుదలయ్యాయి. రానా హీరోగా సంకల్ప్‌ దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నే, అన్వేశ్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డిలు నిర్మిస్తున్న చిత్రం ‘ఘాజీ’. 1971 నాటి ఇండో–పాక్‌ యుద్ధ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నేవీ అధికారి అర్జున్‌ వర్మ పాత్రలో రానా నటిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘తొలి భారతీయ జలాంతర్గామి చిత్రమిది. సాంకేతిక పరంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ చిత్రం కొత్త ఒరవడి సృష్టిస్తుంది. నీటి అడుగున చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. వచ్చే ఫిబ్రవరి 17న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. తాప్సీ, కేకే మీనన్, అతుల్‌ కులకర్ణి, ఓం పురి, నాజర్‌ నటించిన ఈ చిత్రానికి ‘కె’ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement