బ్రేకప్‌ వెంటనే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో యువహీరో! | Ranbir Kapoor dating a Delhi girl | Sakshi
Sakshi News home page

బ్రేకప్‌ వెంటనే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో యువహీరో!

Published Wed, May 11 2016 6:19 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

బ్రేకప్‌ వెంటనే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో యువహీరో!

బ్రేకప్‌ వెంటనే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో యువహీరో!

బాలీవుడ్‌లో బ్రేకప్‌లు ఈ మధ్య బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్‌-సుసానె, విరాట్ కోహ్లి- అనుష్క, రణ్‌బీర్ కపూర్‌-కత్రినా కైఫ్‌, తాజాగా అర్బాజ్‌ ఖాన్‌-మలైకా అరోరా.. ఇలా వరుసగా అన్యోన్యమైన జంటలన్నీ విడిపోతున్నట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో కోహ్లి-అనుష్క ప్రేమజంట మళ్లీ చేరువయ్యే దిశగా సాగుతున్నట్టు కథనాలు వస్తుండగా..  రణ్‌బీర్‌-కత్రిన జోడీ మాత్రం విభేదాలు పక్కనపెట్టి మళ్లీ కలిసిపోయే అవకాశాలు లేనట్టు వినిపిస్తోంది. ఇందుకు కారణం రణ్‌బీర్‌కు కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ దొరకడమేనట.

రేపో-మాపో పెళ్లికి సిద్ధమన్న తరహాలో గాఢంగా ప్రేమించుకున్న రణ్‌బీర్‌-కత్రినా జంట అర్ధంతరంగా బ్రేకప్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రణ్‌బీర్‌ ఇంటి నుంచి పెట్టేబెడా సర్దుకొని కత్రిన బయటకొచ్చినట్టు కథనాలు వచ్చాయి. ఈ బ్రేకప్ కథనాలు హల్‌చల్ చేస్తుండగానే రణ్‌బీర్ కొత్త అమ్మాయితో ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయితో రణ్‌బీర్ ఇప్పుడు ప్రేమలో మునిగిపోయాడని 'బాలీవుడ్‌లైఫ్‌.కామ్‌' ఓ కథనాన్ని ప్రచురించింది. ఆమె సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదంట. ఈ మిస్టరీ గర్ల్‌తో రణ్‌బీర్ రహస్యంగా ప్రేమ కలాపాలు సాగిస్తున్నాడని, అదే సమయంలో ఆమె గురించి చీమచిటుక్కుమన్నంతా సమాచారాన్ని కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలిపింది. నిత్యం వెంటాడే మీడియా కళ్లలో తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ పడకుండా చాలా జాగ్రత్తగా ఈ కొత్త ఎఫైర్‌ను రణ్‌బీర్ సాగిస్తున్నట్టు పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement