
రంగస్థలం ట్రైలర్‌లో సమంత, రామ్‌చరల్ (యాట్యూబ్ గ్రాబ్)
సాక్షి, హైదరాబాద్ : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రంగస్థలం థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. ‘మా ఇంజన్‌కు కులం గోత్రాలు ఉండవు ఏ చేను అయినా తడిపేస్తది అంతే’ ‘చిట్టిబాబు చెవిలోకి మాటెళ్లడం కష్టం గానీ... ఒక్కసారి వెళ్లిందంటే అది గుండెల్లో ఉండిపోద్దయ్యా..’ గిల్లుతున్నావేంటి గాజులు కొనిపెట్టమంటే..! అనే సమంత డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
గ్రామ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. గ్రామ నేపథ్యంలో సాగే కథ కోసం నటీనటులు పడిన కష్టం ట్రైలర్‌లో అర్థం అవుతోంది. ఇప్పటికే విలేజ్ గర్ల్ పాత్రలో సమంత లుక్స్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్‌కు తాజా ట్రైలర్‌తో పండుగ చేసుకుంటారనడంలో సందేహం లేదు. ట్రైలర్‌ను కింద వీక్షించొచ్చు.