
రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోన్
రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోన్ వివాహం గురించి బాలీవుడ్‌లో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. తాజా వార్త ఏంటంటే.. రణ్‌వీర్‌సింగ్ తల్లి అంజుభవ్నాని షాపింగ్ వేటలో పడ్డారు. అంతేకాదు.. ఆమెకు తోడుగా రణ్‌వీర్‌సింగ్ చెల్లెలు రితిక కూడా తోడు వెళ్లారు. ఓ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌కు వెళ్లిన అంజు భవ్నాని, రితిక.. డిఫరెంట్ డిజైన్స్ కలిగిన డైమండ్ నెక్లెస్‌లను పరిశీలించారట. దగ్గర్లోని జ్యువెలరీ షాపులను కూడా చుట్టొచ్చారని టాక్. ఇదంతా చూసిన బాలీవుడ్ జనాలు రణ్‌వీర్, దీపికా పెళ్లి పనులు పరోక్షంగా మొదలయ్యాయని చెప్పుకుంటున్నారు.
అయితే.. రణ్‌వీర్, దీపికా మాత్రం ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. తెలుగు ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’ సినిమా కోసం స్విట్జర్లాండ్ వెళ్లారట రణ్‌వీర్. మొఘనా గుల్జార్ దర్శకత్వంలో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు దీపికా పదుకోన్. ఈ ఏడాది నవంబర్‌లో వీరి వివాహం జరగనుందన్న ప్రచారం హిందీ పరిశ్రమలో ఎప్పటినుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment