
‘గీతగోవిందం’లో విజయ్ దేవరకొండతో స్ర్కీన్ షేర్ చేసుకున్న కన్నడ నటి రష్మిక మంధాన.. మరోసారి డియర్ కామ్రేడ్‌లో ఆయన పక్కన నటిస్తోంది. ఈ చిత్రంలోని ముద్దు సీన్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజా వివాదంపై రష్మిక స్పందిస్తూ ‘లిప్‌లాక్ సీన్‌తో సినిమాని అంచనా వేయడం తగదు. పాత్ర డిమాండ్ చేసింది. కనుక నేను నా పాత్రకు న్యాయం చేశాను’ అని చెప్పింది. గీతగోవిందాన్ని ఆదరించినట్టుగానే ఈ సినిమాని కూడా ఆదరిస్తారనుకుంటున్నానని సెలవిచ్చింది.
రష్మికతోపాటు ట్రోల్ అయిన మరో వ్యక్తి విజయ్ దేవరకొండ. తను నటించిన అర్జున్‌రెడ్డి నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న ‘డియర్ కామ్రేడ్’ వరకు లిప్‌లాక్ లేకుండా ఒక్క సినిమా అయినా లేదు. దీంతో అందరూ విజయ్‌ని ముద్దుగా ‘టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ’గా పిలుచుకుంటున్నారు. విజయ్ మాత్రం ఇప్పటివరకు దీనిపై నోరు మెదపలేదు. డియర్ కామ్రేడ్ సినిమా విషయానికొస్తే కాలేజీ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా ఇది. దేవరకొండ, రష్మిక విద్యార్థి నాయకులుగా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 31న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment