పూరీ రాసిన ప్రేమకథ | romeo puri rasina prema katha reday for Release | Sakshi
Sakshi News home page

పూరీ రాసిన ప్రేమకథ

Published Tue, May 20 2014 11:40 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

పూరీ రాసిన ప్రేమకథ - Sakshi

పూరీ రాసిన ప్రేమకథ

 సాయిరామ్‌శంకర్, అడోనిక జంటగా రూపొందిన చిత్రం ‘రోమియో’. ‘పూరీ రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. గోపి గణేశ్ దర్శకుడు. టచ్‌స్టోన్ దొరైస్వామి నిర్మాత. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘పూర్తిస్థాయి యువతరంసినిమా ఇది. సాయిరామ్‌శంకర్ పాత్ర చిత్రణ ఈ చిత్రానికి హైలైట్. పూరీ జగన్నాథ్ కథ, మాటలు యువతరాన్ని కట్టిపడేస్తాయి. రవితేజ అతిథి పాత్ర చేయడం ఇందులో మరో విశేషం. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఇటీవలే విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోంది. గోపి గణేశ్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతాం’’ అని తెలిపారు. సాయిరామ్‌శంకర్‌కి ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. జయసుధ, నాగబాబు, అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: పి.జి. విందా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement