‘ప్రేమ కూడా ఫీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి?’ | Sai Tejs Solo Brathuke So Better Telugu Movie Theme Video Out | Sakshi
Sakshi News home page

‘ప్రేమ కూడా ఫీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి?’

Published Thu, Feb 13 2020 5:33 PM | Last Updated on Thu, Feb 13 2020 5:55 PM

Sai Tejs Solo Brathuke So Better Telugu Movie Theme Video Out - Sakshi

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. ఈ చిత్రంతో సుబ్బు అనే దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. సాయితేజ్‌కు జంటగా నభా నటేష్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. టైటిల్‌ ప్రకటించినప్పట్నుంచి ఈ సినిమాపై పాజిటీవ్‌ వైబ్స్‌ క్రియేట్‌ అయ్యాయి. అంతేకాకుండా ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రతీ అంశం హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా చిత్ర యూనిట్‌ చిన్న థీమ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. ఎంతో ఎంటర్‌టైన్‌గా ఉన్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

73 సెక​న్ల నిడివి గల థీమ్‌ వీడియో ‘కష్టం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్‌ అలాగే ప్రేమ అనేది కూడా ఓ పీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి?’ అంటూ సాయితేజ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమై.. ‘సోలో సోదర సోదరీమణులారా.. ఈ వేలెంటైన్స్‌ వీకెండ్‌ని మనం అంతా కలిపి జరుపుకుందాం.. మన నినాదం ఒకటే.. సోలో బ్రతుకే సో బెటర్‌’ అంటూ చివరి పంచ్‌తో ముగుస్తుంది. ఇర సాయితేజ్‌ బ్యాగ్రౌండ్‌లో కనిపించే మహానుభావుల ఫోటోలు హైలైట్‌గా నిలిచాయి. ఫుల్‌ అండ్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే1న విడుదల కానుంది. తమన్‌ సంగీతమందిస్తున్నాడు.

చదవండి:
‘సినిమా మే 8న.. టీజర్‌ కమింగ్‌ సూన్‌’ 
‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’కు సెన్సార్‌ షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement