అభిమానులకు కండలవీరుడి కానుక | Salman Khan's special treat for fans who watch 'Hero' movie | Sakshi
Sakshi News home page

అభిమానులకు కండలవీరుడి కానుక

Published Fri, Sep 11 2015 8:33 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అభిమానులకు కండలవీరుడి కానుక - Sakshi

అభిమానులకు కండలవీరుడి కానుక

ముంబయి: తన అభిమానులకు బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ ఆఫర్ ఇచ్చాడు. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన సల్మాన్ లేటెస్ట్ మూవీ 'హీరో' ఈరోజు విడుదలయిన విషయం అందరికి తెలిసిందే. అయితే, ఆ మూవీ చూసిన తన ప్రేక్షకులను వారి టిక్కెట్లను పేర్లు, అడ్రస్ రాసి తనకు పోస్ట్ చేయాలని సల్మాన్ సూచించాడు. ఇందులో అంత విశేషం ఏముందనుకుంటున్నారా.. అభిమానులకు సల్మాన్ ఓ  మాటిచ్చాడు. పోస్ట్ ద్వారా తనకు వచ్చిన టిక్కెట్లలో తొలి వంద మంది అభిమానుల టిక్కెట్లపై తాను తన ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఆయా అభిమానుల టిక్కెట్లను వారి అడ్రస్లకు పంపనున్నట్లు పేర్కొన్నాడు. ఆ లక్కీ అభిమానులలో మీరు ఒకరయ్యే అవకాశం ఉందని ట్వీట్ చేశాడు.

సుభాష్ ఘాయ్ రూపొందించగా,1983లో జాకీష్రాఫ్ హీరోగా వచ్చిన 'హీరో'  మూవీకి సల్మాన్ 'హీరో' రీమేక్ అన్న విషయం అభిమానులందరికీ విదితమే. యాబై ఏళ్లకు దగ్గర పడుతున్నా కండలవీరుడికి అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. వివాదాలతోనే కాదు ఇలా అప్పుడప్పుడు అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో సల్మాన్ ఒకడు. ఈ వివరాలను సల్మాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అభిమానుల పోస్ట్లలో వారి పేరు, అడ్రస్, ట్విట్టర్ ఖాతా పేరు, మూవీ టిక్కెట్ పంపించాలని తన అభిమానులను ఉద్దేశించి కండలవీరుడు సల్మాన్ ట్వీట్ చేశాడు. మూవీ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ చిన్న చిట్కాను వాడి ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మీ టిక్కెట్లను పంపాల్సిన చిరునామా
పోస్ట్ బాక్స్ 9808, బాంద్రా(డబ్ల్యూ) పోస్ట్ ఆఫీస్
ముంబయి 4000050

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement