
సూర్యతో... ఇరవై నాలుగు
సూర్య సరసన ‘అంజాన్’ చిత్రంలో నటించిన సమంత.. ఆయనతో మరో చిత్రంలో జతకట్టనున్నారు. ఈ చిత్రానికి ‘24’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఇది క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ అని వినికిడి. ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్యే నిర్మించనున్నారు. ‘ఇష్క్‘, ‘మనం’ ఫేం విక్రమ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ పాటలు స్వరపరచనున్నారని కోలీవుడ్ టాక్.