మహేష్, పవన్ కంటే చైతూ బెటర్: సమంత
హీరోల మీద గానీ, పరిశ్రమ గురించి గానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో హీరోయిన్ సమంత ముందుంటుంది. ఇంతకుముందు 1.. నేనొక్కడినే చిత్ర పోస్టర్ గురించి ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మళ్లీ మరో వ్యాఖ్య చేసింది. ప్రిన్స్ మహేష్ బాబు, పవన్ కల్యాణ్ కంటే.. నాగచైతన్యతో నటించడమే తనకు ఎక్కువ ఇష్టమని తాజాగా చెప్పింది. తొలిసినిమా 'ఏం మాయ చేశావె' చిత్రంలో నాగ చైతన్యతో ఆమె నటించిన విషయం తెలిసిందే.
ఇటీవలి కాలంలో దూకుడు, అత్తారింటికి దారేది చిత్రాల రూపంలో రెండు పెద్ద హిట్లు ఆమె ఖాతాలో పడ్డాయి. ఈ రెండింటిలో ఆమె నటించినది.. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ పక్కనే. అయినా ఇప్పుడు మాత్రం చైతూతోనే కలిసి నటించడం తనకు ఇష్టమని ఇప్పుడు అంటోంది. అయితే.. ఒకవైపు పవన్, మహేష్లను పరోక్షంగా తిట్టిన సమంత.. జూనియర్ ఎన్టీఆర్ మీద మాత్రం ప్రశంసలు కురిపించింది. తారక్ మంచి డాన్సర్ అని పొగిడింది. ఇటీవల శ్రుతిహాసన్, అమలాపాల్ల మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమంత.. అభిమానుల నుంచి ఎలాంటి ఆగ్రహం చూడాల్సి వస్తుందో మరి!