![Samantha Shares Family Pic From Rana Roka Ceremony - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/23/rana-roka-samantha.jpg.webp?itok=EdKtmx-4)
కుటుంబమంతా ఒక్కచోట చేరితే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం ఇలాంటి ఆనందాన్నే ఆగ్రనటి సమంత అక్కినేని ఆస్వాదిస్తున్నారు. ఇలా కుటుంబం అంతా ఒక్కచోటుకు చేరడానికి కారణమైన తన కజిన్ రానాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తన బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ మిహీకా బజాజ్‌ను రానా పెళ్లాడనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రామానాయుడు స్టూడియోలో రోకా ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలు హాజరై సందడి చేశారు. అయితే కరోనా లాక్‌డౌన్ తర్వాత ఒకేసారి కుటుంబసభ్యులందరినీ కలవడంతో సమంత ఆనందంతో ఎగిరిగంతేశారు.
అంతేకాకుండా రానా రోకా ఫంక్షన్‌లో కుటుంబంతో కలిసి దిగిన గ్రూప్ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘2020లో మాకు శుభవార్త చెప్పినందుకు రానా, మిహీకాలకు ధన్యవాదాలు. మీరు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ సమంత పోస్ట్ చేశారు. దీనికి విక్టరీ వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత కూడా ‘నిజంగానే ది బెస్ట్ న్యూస్’ అని కామెంట్ చేశారు. ఇక రోకా ఫంక్షన్‌కు సంబంధించిన మరిన్ని ఫోటోలను సమంత తన అభిమానులతో పంచుకున్నారు. అయితే లాక్‌డౌన్ స్వల్ప విరామం తర్వాత సమంత చాలా ఎంజాయ్ చేసినట్లు ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక గ్రూప్ ఫోటోలో కూడా సమంత కోసం నెటిజన్లు ఎక్కువగా వెతికడం మరో విశేషం.
చదవండి:
నా భర్త ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో కదా?
ఇది ఆరంభం.. ఇక ఎప్పటికీ: మిహీకా
Comments
Please login to add a commentAdd a comment