సమీరారెడ్డికి పెళ్లి కుదిరింది!
సమీరారెడ్డికి పెళ్లి కుదిరింది!
Published Fri, Dec 27 2013 10:57 PM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM
కథానాయికలకు పెళ్లయితే... అమితంగా బాధపడేది అభిమానులే. కానీ తప్పదు... ఒక్కొక్కప్పుడు గుండె దిటవు చేసుకోవాలి. ‘పక్కనే సమీరారెడ్డి ఫొటో పెట్టి ఏంటీ వేళాకోళం?’ అనుకుంటున్నారా! వేళాకోళం కాదు. నిజమే... ‘సై అంద్రి నానూ... సై అంటిరా..’ అంటూ కన్నడ భాషతో కన్నుగీటిన సమీరారెడ్డి... పెళ్లిపీటలుఎక్కనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అక్షయ్ వార్దేతో ఆమె నిశ్చితార్థం ఈ నెల 14న రహస్యంగా జరిగింది. అదేరోజు సమీరా పుట్టినరోజు కూడా కావడం విశేషం. గత కొంతకాలంగా సమీరా, అక్షయ్ ప్రేమలో ఉన్నారు. వచ్చే ఏడాది వీరి వివాహం ఘనంగా జరగనుందని సమాచారం. సమీరారెడ్డి తెలుగుమ్మాయి, పక్కా హైదరాబాదీ అని తెలిసిందే. నరసింహుడు, అశోక్, జై చిరంజీవ, కృష్ణంవందేజగద్గురుమ్ చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తమిళంలో కూడా చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించారామె.
Advertisement
Advertisement