హీరో కూతురి స్టెప్పులకు అంతా ఫిదా.. వైరల్ | Sara Ali Khan Dance Video Goes Viral | Sakshi
Sakshi News home page

హీరో కూతురి స్టెప్పులకు ఫిదా.. వైరల్

Published Sun, Apr 22 2018 3:41 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Sara Ali Khan Dance Video Goes Viral - Sakshi

సాక్షి, ముంబై: వెండితెరకు పరిచయం అవకముందే ఆ బాలీవుడ్ వారసురాలు సెలబ్రిటీ అయిపోయింది. బాలీవుడ్ జోడీ సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల ముద్దుల తనయ సారా అలీ ఖాన్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేయగా నెటిజన్లు, ఆమె అభిమానులు సారా స్టెప్పులకు ఫిదా అవుతున్నారు.

ఇటీవల ఫ్యాషన్ డిజైనర్ సందీప్ ఖోస్లా బంధువు సౌదామిని మట్టుకు వివాహం జరిగింది. ఆ పెళ్లివేడుకకు సంప్రదాయబద్దంగా చీరలో హాజరైన సారా అలీ ఖాన్ 'సాత్ సముందర్ పార్' అనే పాటకు స్టెప్పులేసింది. వేడకకు వచ్చిన పెద్దలు, సన్నిహితులు ఆమె అద్భుతంగా వేసిన స్టెప్పులకు చప్పట్టు కొడుతూ ప్రొత్సహించారు. 

తెలుగు టెంపర్ హిందీ రీమేక్‌ ‘సింబా’ లో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా సారా నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, ప్రియాప్రకాశ్‌ పేర్లను పరిశీలించిన యూనిట్ చివరకు సారాన్ కన్ఫామ్ చేశారు. కాగా, ఆమె అగ్రిమెంట్ చేసుకున్న అరంగేట్ర మూవీ ‘కేదార్‌నాథ్‌’ లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు జోడీగా నటిస్తున్న సారా.. షూటింగ్ షెడ్యూళ్లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement