సరైన సక్సెస్ | Sarrainodu Success Meet | Sakshi
Sakshi News home page

సరైన సక్సెస్

Published Tue, Apr 26 2016 10:36 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

సరైన సక్సెస్

సరైన సక్సెస్

 ‘‘మా సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో నేను చేసిన ‘హ్యాపీ’, ‘బద్రీనాథ్’ చిత్రాలు సరిగ్గా ఆడలేదు. మా బ్యానర్‌లో ఎలాగైనా హిట్ సాధించాలనే నా కల ‘సరైనోడు’తో తీరింది. ఈ సినిమాతో మాస్‌లోకి వెళ్లాలనే నా లక్ష్యం రెండొందల శాతం నెరవేరింది’’ అని హీరో అల్లు అర్జున్ తెలిపారు. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ కాంబినేషన్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘సరైనోడు’ చిత్రం ఇటీవల విడుదలైంది.
 
 ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ -‘‘బన్నీ ఓ సారి నావద్దకొచ్చి తనకు మాస్ ఇమేజ్ లేదని చెప్పడంతో నాకు వెంటనే బోయపాటి గుర్తొచ్చి కలిశాను. అతను ఆరు నెలలు వర్క్ చేసి కథ రెడీ చేశాడు. అతనిపై నమ్మకంతో భారీగా ఖర్చు పెట్టా. బోయపాటి, బన్నీ కెరీర్‌లో అధిక వసూళ్లు సాధించిన చిత్రమిదే’’ అని చెప్పారు.
 
  ‘‘ప్రతి సినిమానూ తొలి చిత్రంగానే భావిస్తా. ‘లెజెండ్’ తర్వాత మంచి కథతో సినిమా చేయాలని బన్నీతో చేశా. శ్రీకాంత్‌గారు తన పాత్రకు ప్రాణం పోశారు. ఆది పినిశెట్టి విలన్‌పాత్రలో అద్భుతంగా నటించారు’’ అని దర్శకుడు బోయపాటి పేర్కొన్నారు. కథానాయికలు రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్, నటులు శ్రీకాంత్, సాయికుమార్, ఆది పినిశెట్టి, విద్యుల్లేఖా రామన్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ త దితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement