మళ్లీ జీసెస్‌గా విజయ్ చందర్ | satyam vaipu margamu movie Release on 25th december | Sakshi
Sakshi News home page

మళ్లీ జీసెస్‌గా విజయ్ చందర్

Published Tue, Dec 16 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

satyam vaipu margamu movie  Release on 25th december

 ‘కరుణామయుడు’తో వెండితెర జీసెస్ అనిపించుకున్న విజయ్ చందర్ చాలా విరామం తర్వాత జీసస్‌గా నటించిన చిత్రం ‘సత్యం వైపు మార్గం’. నాగబాబు, సూర్య, రూపారెడ్డి, సంధ్యాజనక్, శివ, జయశ్రీనాయుడు, ముఖేశ్, ప్రియాంక అగస్టయిన్, చంద్రశేఖర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. రూపారెడ్డి బసవ నిర్మాత. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ- ‘‘చక్కని స్క్రిప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. విజయచందర్ జీసెస్‌గా నటించిన ఈ చిత్రం యువతరానికి మంచి సందేశం. జీవన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అన్నారు. దైవాన్ని నమ్మని అమ్మాయికీ, జీసెస్‌కి మధ్య జరిగే కథ ఇదని దర్శకుడు చెప్పారు. చాలా విరామం తర్వాత జీసెస్‌గా నటించడం ఆనందంగా ఉందని విజయచందర్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement