ఆమె అంటే పిచ్చి అభిమానం | 'Sawaari' actress Sanam Shetty says Sridevi is her role model | Sakshi
Sakshi News home page

ఆమె అంటే పిచ్చి అభిమానం

Published Wed, Mar 2 2016 5:35 PM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

ఆమె అంటే పిచ్చి అభిమానం - Sakshi

ఆమె అంటే పిచ్చి అభిమానం

అతిలోక సుందరి శ్రీదేవి అంటే పిచ్చి అభిమానం అంటోంది నటి సనమ్ శెట్టి. 2016 మిస్ సౌత్ ఇండియా పోటీల్లో రెండో స్థానంలో నిలిచి ఈ బ్యూటీ హీరోయిన్‌గానూ తన సత్తా చాటుతానంటోంది. ఈ అమ్మడు నాయకిగా నటించిన సవారి చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఎంటర్‌టైన్‌మెంట్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ విడుదల హక్కులను పొందిన సవారి చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న సనమ్‌శెట్టి ఏమంటుందో చూద్దాం. సవారి చిత్రం నాకు చాలా స్పెషల్.
 
  ఇది హాలీవుడ్ బాణీలో రూపొందిన చిత్రం అని చెప్పవచ్చు. దర్శకుడు గుహన్ సెన్నియప్పన్, చాయాగ్రహకుడు చెంజియన్ చిత్రాన్ని పరిమిత సమయంలో, మీడియం బడ్జెట్‌లో బ్రహ్మాండంగా సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించారు. ఇంది డిఫరెంట్‌గా రూపొందిన చిత్రం. బెనిటో హీరోగా నటించగా ఆయనకు ప్రేయసిగా నేను నటించాను. సాధారణంగా ప్రేమ పెళ్లికి దారి తీస్తుంది.అయితే ఈ చిత్రంలో సరిగ్గా పెళ్లి సమయంలో కథ మరో మలుపు తిరుగుతుంది. ఇలాంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కూడిన సవారి చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది .వారు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పగలను.
 
 ఇందులో మరబోటులో సముద్రంలో పయనించే సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు తాను చాలా భయపడ్డాను. కారణం అంతకు ముందెప్పుడూ తాను అసలు మరబోటునే చూసి ఎరుగను. ఇక అది ఎక్కి నటించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. నేను పడవ ఎక్కి పడిపోవవడం హీరో బెనిటో కాపాడడం ఇలా పలుమార్లు జరిగింది. ఏదేమైనా చిత్రం జనరంజకంగా వచ్చింది. ఇక నా గురించి చెప్పాలంటే నటిగా రోల్ మోడల్ శ్రీదేవి. ఆమె అంటే పిచ్చి అభిమానం.
 
  శ్రీదేవిని ఎన్ని సార్లు చూసానో, ఇంకా చెప్పాలంటే ఆమెలా నటించడానికి ప్రయత్నిస్తుంటాను.ఇక ఫేవరేట్ నటుడు గురించి చెప్పాలంటే నటుడు మాధవన్ తన దృష్టిలో ఇప్పటికీ చాక్లెట్ బాయ్‌నే. ఇరుదు చుట్రు చిత్రంలో మాధవన్ నటన ఆయన స్థాయిని 10 రెట్లు పెంచిందనే చెప్పాలి. నాలోని నటనను వెలికి తీసే మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అదే విధంగా సవారి చిత్ర టీజర్‌ను ఆవిష్కరించిన ఆర్యకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ చిత్రాన్ని శ్రీ తెనాండాళ్ ఫిలింస్ సంస్థ విడుదల చేయడంతో మా శక్తి మరింత పెరిగింది. సవారి చిత్రం ఈ నెలలో తెరపైకి రానుంది. చిత్రం విడుదల అనంతరం తన మార్కెట్ పెరుగుతుందనే నమ్మకం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement