
లిప్‌లాక్‌కు రెడీ అంటున్న సాయేష
లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి తాను రెడీ అంటోంది బాలీవుడ్ బ్యూటీ సాయేష. ఒకప్పుడు నూతన కథానాయికలు మహానటి సావిత్రి లాంటి వారిని రోల్‌మోడల్‌గా చెప్పేవారు. రాను రాను ఆ పరిస్థితి మారుతూ వస్తోంది. ఒకప్పుడు పక్కింటి అమ్మారుు ఇమేజ్‌ను కోరుకునేవారు. ఇప్పుడు అందాలారబోతకు రెడీ అని బహిరంగంగానే ప్రకటించేస్తున్నారు. అంతే కాదు హీరోలతో లిప్‌లాక్ సన్నివేశాలకు, ఈత దుస్తులు ధరించడానికి రెడీ అంటున్నారు కూడా. అదేమంటే అందులో తప్పేముంది, అదీ నటనలో భాగమే కదా అంటున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ సాయేష విషయానికొస్తే ఈ అమ్మడు తెలుగులో నటించిన అఖిల్ చిత్రం నిరాశపరచింది.
హిందీలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా నటించిన శివాయ్ పెద్దగా విజయాన్ని అందించలేదు. తాజాగా కోలీవుడ్‌లో రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నారు. ఇంగ్లిష్ భామ ఎమీజాక్సన్‌ను కోలీవుడ్‌కు తీసుకొచ్చిన దర్శకుడు విజయ్ దృష్టిలో ఇప్పుడు సాయేష పడ్డారు. ఆయన జయంరవి హీరోగా తెరకెక్కించనున్న కుమరి కండం చిత్రంలో సాయేషను నాయకిగా పరిచయం చేయనున్నారు.కోలీవుడ్‌లో ఎలాగైనా స్థానం సంపాదించాలన్న పట్టుదలతో ఉన్న సాయేష అవసరమైతే జయంరవితో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి, ఈత దుస్తులు ధరించడానికి రెడీ అని ప్రకటించేస్తున్నారట.