Ajaydevgan
-
చలో ఉక్రెయిన్
లండన్‌కు బై బై చెప్పారు కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్. నెక్ట్స్ ఉక్రెయిన్‌కు వెళ్తారామె. అకివ్ అలీ దర్శకత్వంలో అజయ్ దేవగన్, రకుల్‌ప్రీత్ సింగ్, టబు ముఖ్య తారలుగా హిందీలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా నెల రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లారు రకుల్. ‘‘లండన్ షెడ్యూల్ పూర్తయింది. ‘దేవ్’ సినిమా కోసం ఉక్రెయిన్ వెళ్తున్నాను. హిందీ టు తమిళ్’’ అని పేర్కొన్నారు రకుల్. కార్తీ హీరోగా రజత్ రవిశంకర్ దర్శకునిగా పరిచయం అవుతున్న తమిళ చిత్రం ‘దేవ్’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడానికే రకుల్ ఉక్రెయిన్ వెళ్తున్నారు. ‘దేవ్’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. -
అలుపు సొలుపు ఉండదు
పని ఒత్తిళ్లు, ఎక్కువ పని గంటలున్నప్పుడు సాధారణంగా అలసిపోతుంటాం. కానీ ఈ రూల్ రకుల్‌కి వర్తించదట. లాంగ్ వర్కింగ్ డేస్‌లోనే ఇంకా మజా వస్తుంది అంటున్నారీ భామ. హీరోయిన్గా బిజీ షెడ్యూల్స్ గురించి ఆమె మాట్లాడుతూ–‘‘షూటింగ్ ఎప్పుడూ ఒకేచోట జరగదు. వివిధ ప్రదేశాలు తిరగాల్సి వస్తుంటుంది. ఈరోజు చెన్నైలో ఉంటే ఆ మరుసటి రోజు ముంబైలోనో, ఢిల్లీలోనో ఉంటాం. బట్ వర్క్‌హాలిక్ కాబట్టి ఇవన్నీ నన్ను అలసిపోయేలా చేయవు. వర్క్ ఎంత చేసినా అలుపు సొలుపు అంత సులువుగా రావు. లాంగ్ వర్కింగ్ షెడ్యూల్స్‌ని ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను’’ అని పేర్కొన్నారు. వర్క్‌హాలిక్ కాబట్టే ముంబైలో అజయ్ దేవగన్ సినిమా, హైదరాబాద్‌లో కార్తీ సినిమా షూటింగ్స్‌కు అటు ఇటు షిఫ్ట్ అవుతూ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు రకుల్. -
లిప్‌లాక్‌కు రెడీ అంటున్న సాయేష
లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి తాను రెడీ అంటోంది బాలీవుడ్ బ్యూటీ సాయేష. ఒకప్పుడు నూతన కథానాయికలు మహానటి సావిత్రి లాంటి వారిని రోల్‌మోడల్‌గా చెప్పేవారు. రాను రాను ఆ పరిస్థితి మారుతూ వస్తోంది. ఒకప్పుడు పక్కింటి అమ్మారుు ఇమేజ్ను కోరుకునేవారు. ఇప్పుడు అందాలారబోతకు రెడీ అని బహిరంగంగానే ప్రకటించేస్తున్నారు. అంతే కాదు హీరోలతో లిప్‌లాక్ సన్నివేశాలకు, ఈత దుస్తులు ధరించడానికి రెడీ అంటున్నారు కూడా. అదేమంటే అందులో తప్పేముంది, అదీ నటనలో భాగమే కదా అంటున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ సాయేష విషయానికొస్తే ఈ అమ్మడు తెలుగులో నటించిన అఖిల్ చిత్రం నిరాశపరచింది. హిందీలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా నటించిన శివాయ్ పెద్దగా విజయాన్ని అందించలేదు. తాజాగా కోలీవుడ్‌లో రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నారు. ఇంగ్లిష్ భామ ఎమీజాక్సన్‌ను కోలీవుడ్‌కు తీసుకొచ్చిన దర్శకుడు విజయ్ దృష్టిలో ఇప్పుడు సాయేష పడ్డారు. ఆయన జయంరవి హీరోగా తెరకెక్కించనున్న కుమరి కండం చిత్రంలో సాయేషను నాయకిగా పరిచయం చేయనున్నారు.కోలీవుడ్‌లో ఎలాగైనా స్థానం సంపాదించాలన్న పట్టుదలతో ఉన్న సాయేష అవసరమైతే జయంరవితో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి, ఈత దుస్తులు ధరించడానికి రెడీ అని ప్రకటించేస్తున్నారట. -
అజయ్‌దేవ్‌గన్‌తో ఏపీ ఛాంబర్స్ ప్రతినిధుల భేటీ
లబ్బీపేట : ప్రముఖ బాలీవుడ్ నటుడు, హీరో అజయ్‌దేవ్‌గన్ మంగళవారం విజయవాడ వచ్చిన సందర్భంగా ఆంధ్రపదేశ్ ఛాంబర్స్ ప్రతినిధులు ఆయనను ప్రత్యేకంగా కలిసి, పలు విషయాలపై చర్చిం చారు. అజయ్‌దేవ్‌గన్ ఏపీలో పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్లు ఛాంబర్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని భేటీ అయ్యేలా ఏపీ ఛాంబర్స్ టూరిజం సబ్‌కమిటీ చైర్మన్ కె లక్ష్మీనారాయణ ప్రత్యేక కృషి చేసినట్లు తెలిపారు. నవ్యాంధ్ర పర్యాటక రంగంలో థీమ్ పార్కులు, వాటర్ బేస్డ్ పార్కులు వంటి ప్రాజెక్టులు, రిసార్టులు, ఆహార శుద్ధి రంగాలలో పెట్టుబడుల అవకాశాలపై ఏపీ ఛాంబర్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పొట్లూరి భాస్కరరావు ఈ సందర్భంగా అజయ్‌దేవ్‌గన్‌కు వివరిం చారు. ఏపీ ఛాంబర్స్ మీడియా, ఎంటర్టైన్మెంట్ సబ్ కమిటీ చైర్మన్ యార్లగడ్డ రత్నకుమార్, ప్రెసిడెంట్ ముత్తవరపు మురళీకృష్ణ (ఎలక్ట్ ), బోర్డు ఆఫ్ డెరైక్టర్లు సీహెచ్ఆర్కే ప్రసాద్, కేవీఎస్ ప్రకాశరావు, టూరిజం సబ్ కమిటీ చైర్మన్ కె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నట్లు అజయ్‌దేవ్‌గన్ చాంబర్ ప్రతినిధులతో పేర్కొన్నారు. వై స్క్రీన్స్ లోగో ఆవిష్కరణ వై స్క్రీన్స్ ఎంటర్‌ైటె న్ మెంట్ ఇండియాకు సంబంధించిన లోగోను మంగళవారం అజయ్‌దేవ్‌గన్ అవి ష్కరించారు. హోటల్ పర్చ్యూన్ మురళీపార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాచార వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందన్నారు. వై స్క్రీన్స్ ప్రతినిధి వైవీ రత్నకుమార్ మాట్లాడుతూ తమ స్క్రీన్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్, షాపింగ్ ఇండస్ట్రీ సమాచారం అందించనున్నట్లు తెలిపారు. ఏపీలోని 670 మండలాల్లో తమ మిని డిజిటల్ థియేటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ చాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు.