అజయ్‌దేవ్‌గన్‌తో ఏపీ ఛాంబర్స్ ప్రతినిధుల భేటీ
లబ్బీపేట : ప్రముఖ బాలీవుడ్ నటుడు, హీరో అజయ్‌దేవ్‌గన్ మంగళవారం విజయవాడ వచ్చిన సందర్భంగా ఆంధ్రపదేశ్ ఛాంబర్స్ ప్రతినిధులు ఆయనను ప్రత్యేకంగా కలిసి, పలు విషయాలపై చర్చిం చారు. అజయ్‌దేవ్‌గన్ ఏపీలో పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్లు ఛాంబర్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని భేటీ అయ్యేలా ఏపీ ఛాంబర్స్ టూరిజం సబ్‌కమిటీ చైర్మన్ కె లక్ష్మీనారాయణ ప్రత్యేక కృషి చేసినట్లు తెలిపారు. నవ్యాంధ్ర పర్యాటక రంగంలో థీమ్ పార్కులు, వాటర్ బేస్‌డ్ పార్కులు వంటి ప్రాజెక్టులు, రిసార్టులు, ఆహార శుద్ధి రంగాలలో పెట్టుబడుల అవకాశాలపై ఏపీ ఛాంబర్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పొట్లూరి భాస్కరరావు ఈ సందర్భంగా అజయ్‌దేవ్‌గన్‌కు వివరిం చారు. ఏపీ ఛాంబర్స్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సబ్ కమిటీ చైర్మన్ యార్లగడ్డ రత్నకుమార్, ప్రెసిడెంట్ ముత్తవరపు మురళీకృష్ణ (ఎలక్ట్ ), బోర్డు ఆఫ్ డెరైక్టర్లు సీహెచ్‌ఆర్‌కే ప్రసాద్, కేవీఎస్ ప్రకాశరావు, టూరిజం సబ్ కమిటీ చైర్మన్ కె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నట్లు అజయ్‌దేవ్‌గన్ చాంబర్ ప్రతినిధులతో పేర్కొన్నారు.
వై స్క్రీన్స్ లోగో ఆవిష్కరణ
వై స్క్రీన్స్ ఎంటర్‌ైటె న్ మెంట్ ఇండియాకు సంబంధించిన లోగోను మంగళవారం అజయ్‌దేవ్‌గన్ అవి ష్కరించారు. హోటల్ పర్చ్యూన్ మురళీపార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాచార వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందన్నారు. వై స్క్రీన్స్ ప్రతినిధి వైవీ రత్నకుమార్ మాట్లాడుతూ తమ స్క్రీన్స్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్ ఇండస్ట్రీ సమాచారం అందించనున్నట్లు తెలిపారు. ఏపీలోని 670 మండలాల్లో తమ మిని డిజిటల్ థియేటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ చాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు.