
పని ఒత్తిళ్లు, ఎక్కువ పని గంటలున్నప్పుడు సాధారణంగా అలసిపోతుంటాం. కానీ ఈ రూల్ రకుల్‌కి వర్తించదట. లాంగ్ వర్కింగ్ డేస్‌లోనే ఇంకా మజా వస్తుంది అంటున్నారీ భామ. హీరోయిన్‌గా బిజీ షెడ్యూల్స్ గురించి ఆమె మాట్లాడుతూ–‘‘షూటింగ్ ఎప్పుడూ ఒకేచోట జరగదు. వివిధ ప్రదేశాలు తిరగాల్సి వస్తుంటుంది. ఈరోజు చెన్నైలో ఉంటే ఆ మరుసటి రోజు ముంబైలోనో, ఢిల్లీలోనో ఉంటాం.
బట్ వర్క్‌హాలిక్ కాబట్టి ఇవన్నీ నన్ను అలసిపోయేలా చేయవు. వర్క్ ఎంత చేసినా అలుపు సొలుపు అంత సులువుగా రావు. లాంగ్ వర్కింగ్ షెడ్యూల్స్‌ని ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను’’ అని పేర్కొన్నారు. వర్క్‌హాలిక్ కాబట్టే ముంబైలో అజయ్ దేవగన్ సినిమా, హైదరాబాద్‌లో కార్తీ సినిమా షూటింగ్స్‌కు అటు ఇటు షిఫ్ట్ అవుతూ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు రకుల్.
Comments
Please login to add a commentAdd a comment