
విసు
సాక్షి, చెన్నై : ప్రముఖ దర్శక నటుడు, రచయిత మీనాక్షిసుందరం రామస్వామి విశ్వనాధన్(విసు,72) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1945 జులై 1న తమిళనాడులో జన్మించారాయన. ప్రఖ్యాత దర్శకుడు కే. బాలచందర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. 1981లో వచ్చిన ‘కుటుంబం ఒరు కదంబం’ అనే తమిళ చిత్రంతో నటుడిగా మారారు. ఈ సినిమాకు కథను అందించింది కూడా ఆయనే. పలు చిత్రాలకు కథలని అందించిన ఆయన ‘కణ్మని పూంగ’ అనే సినిమాతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
తమిళ సినిమా తెరపై కథా రచన, దర్శకత్వం, నిర్మాణం, నటన ఇలా అన్ని రంగాల్లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 2016లో బీజేపీలో చేరి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment