29న సర్వర్‌సుందరం
తమిళసినిమా: ఇప్పుడు సగటు మనిషికి కావలసింది వినోదం ఒక్కటే. నిత్యం సవాలక్ష సమస్యలతోనో, ఊపిరాడనంత పనులతోనో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు కాస్త రిలాక్స్ నిచ్చేది సినిమానే అయితే. అందులో ఆహ్లాదానిచ్చేవి వినోదభరిత కథా చిత్రాలే. అలా ప్రేక్షకుల చేత నవ్వుల పువ్వులు పూయించడానికి సర్వర్‌సుందరంగా వచ్చేస్తున్నాడు నటుడు సంతానం. హాస్యనటుడిగా పంచ్ డైలాగ్స్‌తో అందరిని అలరించిన ఈయన హీరోగా అవతారమెత్తినా వినోదాన్నే ఆయువుపట్టుగా విజయాలను అం దుకుంటున్నారు. దిల్లుక్కు దుడ్డు వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత సంతానం నటిస్తు న్న చిత్రాల్లో సర్వర్‌సుందరం ఒక టి. కెన్నా ఫిలిం స్ పతాకంపై రాజాసుందర్ నిర్మించిన ఈ చిత్రంలో సంతానంకు జంటగా వైభివి శాండిల్య నటించింది.
సీనియర్ నటుడు రాధారవి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా ఆనంద్‌బాల్కీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సం తోష్‌నారాయణన్ సంగీతాన్ని అందించిన సర్వర్‌సుంద రం చిత్ర టీజర్, ట్రైలర్‌లను ప్రేక్షకులు మిలియన్ల సంఖ్యంలో లైక్ చేశారని చిత్ర వర్గాలు తెలిపారు. దీంతో చిత్రంపై అభిమానుల్లోనూ, పరిశ్రమలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయని, ఆ అంచనా లను సర్వర్‌సుందరం కచ్చితంగా రీచ్ అవుతుం దనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది. వినోదమే ప్రధానంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని అంటున్నారు. చిత్రాన్ని ఈ నెల 29వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర వర్గాలు వెల్లడించాయి.