ఏడుగురు భార్యలు!
‘‘చిన్న నటుడినైనా నాకు ‘హృదయ కాలేయం’ సినిమాతో ప్రజల్లో గుర్తింపు వచ్చింది. ఈ ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని నటుడు సంపూర్ణేష్ బాబు అన్నారు. ఆయన హీరోగా రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్, గుడ్ సినిమా గ్రూప్, సంజనా మూవీస్ నిర్మించిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. షకీలా, గాయత్రి, ఇషిక, భార్గవి, మహేశ్ కత్తి తదితరులు ముఖ్యపాత్రలో నటించారు.
ఆది కుంభగిరి, సాయి రాజేష్ శీలం నిర్మాతలు. జూన్‌లో చిత్రం విడుదల కానుంది. సోమవారం సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ మాట్లాడుతూ– ‘‘కొబ్బరి మట్ట’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఏడుగురు భార్యలు, పన్నెండు మంది పిల్లలు, ముఫ్పై నలభైమంది పిల్లలతో సినిమా పెద్ద కుంటుంబంలా ఉంటుంది. సోలో హీరోగా మరో రెండు సినిమాలు చేస్తున్నాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ సినిమా చేయడం లేదు’’ అని అన్నారు. ‘‘