
గురువారం దీపావళి పండగ నాడు ఏ రేంజ్‌లో మోత మోగించేయాలా? అని చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. ‘పొల్యూషన్’ ఇష్టం లేనివాళ్లు టపాసులకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. శ్రద్ధా కపూర్ కూడా అలానే అనుకుంటున్నారు. ‘‘ఈ దీపావళికి క్రాకర్స్ కాల్చి, ఎన్విరాన్‌మెంట్‌ను పొల్యూట్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయండి. టపాసులు పేల్చడం వల్ల మూగజీవాలకు హాని కలుగుతుంది’’ అని ‘సాహో’ ద్వారా తెలుగు తెరపైనా మెరవనున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ చిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే ఈ పోస్ట్‌కు ఫాలోయర్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు ‘బాగా చెప్పారు’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. కొందరు మాత్రం ‘ముందు మీరు ఎన్విరాన్‌మెంట్‌ని ప్రొటెక్ట్ చేసేలా ప్రవర్తించండి’ అన్నారు. ‘అవును... అందరూ టపాసులు కొని, దాచుకోండి. తర్వాత శ్రద్ధా మూవీ ప్రమోషన్‌కు కాల్చండి’ అని కామెంట్ చేశారు. అంతేకాదు.. రెండేళ్ల క్రితం శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్ నటించిన ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్‌లో క్రాకర్స్ పేలుతున్న ఫొటోను పోస్ట్ చేశాడో ఫాలోయర్. ‘శ్రద్ధా.. మీరు కారు, ఏసీలు వాడొద్దు. ఎన్విరాన్‌మెంట్ పొల్యూట్ అవుతుంది’ అని ఓ వ్యక్తి వ్యంగ్యంగా అన్నాడు. ఇంకో వ్యక్తి అయితే.. ‘పాపం.. మూగజీవాలు ఏం పాపం చేశాయి. మీరు నాన్‌వెజ్ తినడం మానేయండి’ అని రిప్లై ఇచ్చాడు. మంచి చెబుతూ, పోస్ట్ చేసిన వీడియోకు ఇంత నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందని శ్రద్ధా ఊహించి ఉండరు. అందుకే, ఈ కామెంట్స్‌కి స్పందించకుండా సైలెంట్ అయిపోయారు.