లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన శృతి హాసన్ తరువాత తనదైన టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమా చేసి సత్తా చాటింది. కానీ కొంత కాలంగా ఈ భామ వెండితెరకు దూరమైంది. ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ కొర్సేల్‌తో విదేశాల్లో పర్యటిస్తున్న ఈ బ్యూటీ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసింది.
అయితే తాజాగా శృతి తన బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసిందన్న టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా రిలేషన్‌షిప్‌కు దూరమైన తరువాతే తిరిగి సినిమాల్లో నటించేందుకు అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మైఖేల్ చేసిన ఓ ట్వీట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
గతంలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలకు మై లవ్, డార్లింగ్ అంటూ కామెంట్ చేసిన మైఖేల్ ఈ సారి మాత్రం బెస్ట్ మేట్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో శృతి హాసన్, మైఖేల్ కొర్సేల్‌లు విడిపోయారంటూ కోలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై శృతి మాత్రం స్పందించలేదు. విజయ్ సేతుపతి సరసన శృతి హీరోయిన్‌గా నటిస్తున్న ‘లాభం’ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment