హన్సికతోనూ తెంచుకున్నాడు! | Simbu Announces His Break Up With Hansika Motwani | Sakshi
Sakshi News home page

హన్సికతోనూ తెంచుకున్నాడు!

Published Wed, Feb 26 2014 6:44 PM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM

హన్సికతోనూ తెంచుకున్నాడు!

హన్సికతోనూ తెంచుకున్నాడు!

చెన్నై: హన్సికతో ప్రేమాయణానికి తమిళ నటుడు శింబు ముగింపు పలికాడు. తమ మధ్య కొనసాగిన ప్రేమ వ్యవహానికి కటీఫ్ చెప్పాడు. ఈ మేరకు స్వయంగా ప్రకటన చేశారు. హన్సికతో ప్రేమబంధాన్ని తెంచుకున్నట్టు ట్విటర్లో పేర్కొన్నాడు.

"ఈ బంధానికి ఇక్కడితో ముగింపు పలుకుతున్నా. ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా. నేనిప్పుడు ఒంటరి పక్షిని. హన్సికతో కొనసాగించిన బంధం గురించి చెప్పడానికేమీ లేదు. అదంతా జరిగిపోయిన గతం. అయితే దీని గురించి నేను బాధ పడడం లేదు. ఈ ప్రకటన చేయడానికి దారితీసిన పరిస్థితుల గురించి చెప్పలేను. నా సన్నిహితులు, సహచరులు, నా అభిమానులకు నా గురించి తెలిపేందుకు ఈ ప్రకటన చేస్తున్నా. ఇక నుంచి కెరీర్పై దృష్టి పెడతా. నేనిప్పుడు సంతోషంగా ఉన్నానని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉపశమనం లభించినట్టుగా ఉంది'' అని ట్విటర్లో శింబు పోస్ట్ చేశాడు.

రియల్ లైఫ్నూ ప్రేమికుడిగా శింబు సుపరిచితుడు. గతంలో నయన తారతోనూ అతడు విఫల ప్రేమాయణం సాగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement