
రొమాంటిక్ క్రైమ్ కామెడీ!
సుమంత్ హీరోగా ఓ చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. మనీ, మనీ మనీ, వన్ బై టూ, పట్టుకోండి చూద్దాం, సిసింద్రీ తదితర చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుంది. రొమాంటిక్ క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల మూడో వారంలో మొదలు కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్.ఎస్. క్రియేషన్స్, చెర్రీ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.