జై బోలో సమైక్యాంధ్ర | Sobharani, Kavitha Play Keyroles in Jai Bolo samaikyandhra | Sakshi
Sakshi News home page

జై బోలో సమైక్యాంధ్ర

Published Tue, Sep 24 2013 2:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

జై బోలో సమైక్యాంధ్ర

జై బోలో సమైక్యాంధ్ర

 ‘‘రాష్ర్టం ఐక్యంగా ఉంటే ఎంత అభివృద్ధి చెందుతుంది, విడిపోతే ఎలాంటి కష్టాలుంటాయనే అంశంతో రూపొందుతున్న చిత్రం ఇది. సినిమా ద్వారా కోట్లాది మందిని ప్రభావితం చేయొచ్చు. అందుకే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను. సమైక్యవాదానికి ఊతమిచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. తెలంగాణవాదులను కించపరిచే సన్నివేశాలుండవు’’ అన్నారు శోభారాణి. 
 
 మహా మూవీ మేకర్స్ పతాకంపై లక్ష్మణ్ పూడి దర్శకత్వంలో పి. వెంకటరావు నిర్మించనున్న చిత్రం ‘జై బోలో సమైక్యాంధ్ర’. శోభారాణి, కవిత ముఖ్య తారలు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇందులో ఓ సంచలన కథానాయకుడు కీలక పాత్ర చేయనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు ముఖ్య పాత్రలు చేస్తారు. ప్రజా కళాకారులతో పాటలు రాయించి, ప్రజా గాయకుల చేత పాడించనున్నాం’’ అని చెప్పారు. 
 
 అక్టోబర్ 2న షూటింగ్ ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న సినిమాని విడుదల చేస్తామని పి.వెంకటరావు తెలిపారు. ఈ సమావేశంలో గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: రామాన శివకుమార్, కారి గోవిందరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏ.యు. మహేష్‌రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement