సోషల్ మీడియాలో నటి ఫొటోలు హల్ చల్! | Sonakshi Sinha Holiday Pics goes viral on social media | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో నటి ఫొటోలు హల్ చల్!

Sep 27 2016 9:57 PM | Updated on Apr 3 2019 6:23 PM

సోషల్ మీడియాలో నటి ఫొటోలు హల్ చల్! - Sakshi

సోషల్ మీడియాలో నటి ఫొటోలు హల్ చల్!

సాగర తీరంలో సేద తీరితే మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని ఎప్పుడూ చెబుతుండేది బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా.

సాగర తీరంలో సేద తీరితే మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని ఎప్పుడూ చెబుతుండేది బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. ప్రస్తుతం ఈ బాలీవుడ్ భామ అదే పనిలో ఉంది. అయితే స్వదేశీ బీచ్ లకు వెళితే తనను గుర్తుపట్టే అవకాశం ఉందని గతంలో చెప్పిన సోనాక్షి.. ఏకంగా తూర్పు ఆఫ్రికా బీచ్ లలో హాయిగా సేదతీరుతోంది. ప్రస్తుతం సోనాక్షి వెకేషన్ టూర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ తన ట్రిప్ ఫొటోలను అలా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిందో లేదో.. అంతే వేల లైక్స్ ను గంటల్లోనూ సంపాదించుకుంది. గతంలో బుల్లితెర నటీమణులు కొందరు ఇలాగే హాలిడే స్పాట్స్ ఫొటోలతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.

మురుగదాస్ దర్శకత్వంలో చేసిన యాక్షన్ మూవీ ‘అఖీరా’కి సోనాక్షి చాలానే కష్టపడింది. పవర్‌ఫుల్ ఫైట్స్ చేసి అలసిపోయిన ఈ బ్యూటీ ఈ సినిమా విడుదల కావడంతో ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయింది. దీంతో నెక్ట్స్ సినిమా మొదలుపెట్టే ముందు కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని భావించి తనకెంతో ఇష్టమైన బీచ్‌లు చూసేందుకు వెళ్లింది. సోనాక్షి ఫొటోలు చూస్తే మనకు కూడా బ్యాగ్ ప్యాక్ చేసి ఎక్కడికైనా టూర్ వెళ్లాలనిపిస్తుంది. అంతగా ఆమె బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ... బోటు షికారు చేసి సరదాగా గడిపింది. మొదట అక్కడ ఎయిర్ పోర్టులో కాలుపెట్టగానే సిబ్బందితో కలిసి ఓ ఫొటో దిగింది. ఆ తర్వాత బీచ్ నీళ్లలో కేరింతలు కొడుతూ.. అక్కడి అందాలను తనకు నచ్చిన తీరుగా కామెంట్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు షేర్ చేసింది. తనకు ఆ ప్రాంతం మరో స్వర్గంలా అనుభూతినిచ్చిందని రిసార్ట్స్ వద్ద దిగిన ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె ఫాలోయర్స్ మాత్రం సోనాక్షి సో హాట్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement