టైమ్‌మెషీన్ ఎక్కినంత ఆనందం కలిగింది | Sonakshi Sinha takes her first tram ride for 'Bullet Raja' | Sakshi
Sakshi News home page

టైమ్‌మెషీన్ ఎక్కినంత ఆనందం కలిగింది

Published Mon, Oct 28 2013 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

Sonakshi Sinha takes her first tram ride for 'Bullet Raja'

కొన్ని విషయాలు చూడ్డానికి, చెప్పుకోడానికి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కానీ కొంతమందికి అల్ప విషయాల్లోనే అనల్ప విషయాలు, అనంతానందాలు కనబడతాయి. సోనాక్షి సిన్హానే తీసుకోండి. చోటా నవాబ్ సైఫ్ ఆలీ ఖాన్‌తో కలిసి ఆమె ‘బుల్లెట్ రాజా’ చిత్రంలో నటిస్తోంది. అయితే సైఫ్‌తో కలిసి బుల్లెట్ ఎక్కడానికి బదులు వందేళ్ల లోకల్ ట్రామ్‌లో ప్రయాణించింది. ట్రామ్‌లో ప్రయాణించడం ఊహించనంత ఆనందం కలిగించిందామెకు.
 
 ‘సామ్నే హై సవేరా’ అనే రొమాంటిక్ సాంగ్‌ని కోల్‌కతాలోని ప్రాచీన వారసత్వ కట్టడాలు, ఇతర ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఈ పాటకోసం రిక్షాలను లాగడంతోపాటు, పురాతన ట్రామ్‌లో ప్రయాణించడం గొప్ప అనుభూతిని కలిగించింది. టైమ్‌మెషీన్ ఎక్కినంత ఆనందం కలిగింది.ఈ ఆనందాన్ని పంచుకోవాలంటే  తోడుగా ఎవరూ లేరు’’ అని ఓ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లో సోనాక్షి పేర్కొంది. తిగ్మాన్షు ధూలియా దర్శకత్వం వహిస్తున్న ‘బుల్లెట్ రాజా’ చిత్రం నవంబర్ 29న విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement