
లాస్ ఏంజిల్స్ వీధుల్లో అతిలోక సుందరి..
అతిలోక సుందరి శ్రీదేవి, ఆమె కూతురు జాహ్నవి కపూర్‌లు లాస్ ఏంజిల్స్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. స్టైలీష్ లుక్‌లతో ఫోటోలకు పోజులిస్తూ సేద తీరుతున్నారు. శ్రీదేవి షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎంబ్రైడరీ దుస్తులను ఫ్యాషన్ అయ్యేలా తల్లీ కూతుళ్లు ఫోటోలకు పోజులిచ్చారు. బోనీ కపూర్ నిర్మించిన మామ్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీదేవి.. ఖాళీ సమయాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌తో గడుపుతొంది. గత వారం షారుక్ ఖాన్ ఫ్యామిలీతో శ్రీదేవి ఫ్యామిలీ దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇప్పుడు శ్రీదేవి తన ఫోటోను ఇన్‌స్ట్రాగ్రమ్‌లో పోస్టు చేసింది.
మామ్ తర్వాతి ప్రాజెక్టును ప్రకటించని శ్రీదేవి మిస్టర్ ఇండియా(1987) సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జానీ కపూర్ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంటరయ్యే అవకాశం ఉందని, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కత్తర్‌తో ఆమె నటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.