
ఆ అందం వెండితెరకెక్కి 50 ఏళ్లు
వెండితెరపై యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడం ఏ నటుడి కెరీర్లో అయినా ఓ మైళురాయే. అలాంటిది ఓ నటి యాభై ఏళ్లపాటు కెరీర్ కొనసాగించటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతకు చేరువైంది అతిలోకసుందరి శ్రీదేవి. తన నాలుగో ఏటనే వెండితెర మీద మెరిసిన ఈ అందాల రాశి కొత్త సంవత్సరంలో నటిగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి రెడీ అవుతోంది.
1967లో రిలీజ్ అయిన 'కాంధాన్ కరుణాయ్' అనే తమిళ సినిమాతో తొలిసారిగా వెండితెర మీద కనిపించింది శ్రీదేవి. నాలుగేళ్ల వయసులో కుమారస్వామి పాత్రలో నటించింది. అంతేకాదు తొలి సినిమాలోనే శివాజీ గణేషన్, జయలలిత, కేఆర్ విజయ లాంటి దిగ్గజనటులతో కలిసి నటించింది. ప్రస్తుతం శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన మామ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను 2017లో నటిగా శ్రీదేవి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.