హాలీవుడ్ సినిమాలో శ్రీదేవి | Sridevi to cast in Hollywood movie | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ సినిమాలో శ్రీదేవి

Published Sat, Sep 21 2013 12:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

హాలీవుడ్ సినిమాలో శ్రీదేవి

హాలీవుడ్ సినిమాలో శ్రీదేవి

ఒకప్పుడు భారతీయ సినిమాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన తార శ్రీదేవి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె ఇటీవలే ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రవిజయంతో ఐదుపదుల వయసులోనూ తనకు తిరుగు లేదని నిరూపించేసుకున్నారామె. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత శ్రీదేవికి బోల్డన్ని అవకాశాలు వచ్చినా, దేనికీ పచ్చజెండా ఊపలేదు. 
 
చేస్తే మళ్లీ హిట్ సినిమానే చేయాలనే పట్టుదలతో ఉన్నారామె. ఈ నేపథ్యంలోనే కోన వెంకట్ చెప్పిన కథ నచ్చి, ఆమె ఒప్పుకున్నారు. తాజాగా, శ్రీదేవిని ఓ హాలీవుడ్ ఆఫర్ వరించిందని సమాచారం. హాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెరిల్ స్ట్రీప్, శ్రీదేవి కాంబినేషన్‌లో జెరిమీ వాల్, జెర్రీ లీడర్ ఓ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారట. 
 
ఈ చిత్రానికి ‘కౌబోయ్స్ అండ్ ఇండియన్స్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని, దీనికి అమీ రెడ్‌ఫోర్డ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇటీవలే ఈ చిత్రం గురించి శ్రీదేవితో చర్చించారట. అయితే శ్రీదేవి మాత్రం అధికారికంగా సైన్ చేయలేదని వినికిడి. ఈ అవకాశం వచ్చింది నిజమేనని, కథ కూడా తమ చేతికొచ్చిందని శ్రీదేవి భర్త బోనీకపూర్ ఓ ప్రకటనలో తెలిపారు. 
 
తమ కుమార్తె జాన్వీ ఈ కథ చదివిన తర్వాతే అసలు విషయాన్ని నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ శ్రీదేవి ఈ సినిమా ఒప్పుకుంటే హాలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి సినిమా అవుతుంది. వాస్తవానికి శ్రీదేవి ఎప్పుడో హాలీవుడ్‌లో చేయాల్సి ఉంది. ఆలస్యం అయినా తన దైన ఓ మార్క్ చూపిస్తారని అభిమానుల ఆకాంక్ష.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement