యువ నటుడు సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మరో ఆసక్తికర చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ సుధీర్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ఆర్‌ఎస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.
ఇప్పటికే డిఫరెంట్ పోస్టర్‌లతో ఆకట్టుకున్న టీం, తాజాగా టీజర్‌ను స్టీలర్ పేరుతో రిలీజ్ చేశారు. సుధీర్ బాబు టిపికల్ మెంటాలిటీ ఉన్న మేనేజర్ పాత్రలో కనిపిస్తుండగా హీరోయిన్ నభా నటేష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నారు. ఇతర కీలక పాత్రల్లో నాజర్, వేణులు నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment