
‘బాహుబలి’లో తమన్నా
ప్రభాస్ సరసన మరోసారి నాయికగా నటించబోతున్నారు తమన్నా. రాజమౌళి దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతోన్న ‘బాహుబలి’లో ఆమె ఒక కథానాయికగా ఎంపికయ్యారు. నేడు తమన్నా పుట్టినరోజు సందర్భంగా, ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ‘బాహుబలి’లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్ర పేరు బాహుబలి కాగా, మరొకటి శివుడు. బాహుబలి పక్కన అనుష్క నటిస్తున్నారు. ఈ శివుడికి జోడీగా తమన్నా ఎంపికయ్యారు. ఈ విశేషాలను నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని వివరిస్తూ -‘‘ఇందులో తమన్నా పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా విషయానికొస్తే... ఈ నెల 23 నుంచి ఆర్‌ఎఫ్‌సీలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నాం. మార్చి 5 వరకూ ఈ షెడ్యూలు జరుగుతుంది’’ అన్నారు.