జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్లో కార్తీ! | Tamil actor karthi set to replace junior ntr! | Sakshi
Sakshi News home page

జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్లో కార్తీ!

Published Sat, Sep 13 2014 12:43 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్లో కార్తీ! - Sakshi

జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్లో కార్తీ!

జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్ను తమిళ హీరో కార్తీ ఆక్రమించినట్లు సమాచారం. అక్కినేని నాగార్జునతో కలిసి ఎన్టీఆర్  చేయాల్సిన మల్టీ స్టారర్ చిత్రంలో కార్తీ నటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న కార్తీని జూనియర్ ప్లేస్లో తీసుకున్నట్లు  టాలీవుడ్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ చిత్రం....  వంశీ  పైడిపల్లి  దర్శకత్వంలో రూపొందనుంది. కాగా ఎన్టీఆర్ రీప్లేస్ వార్తను దర్శకుడు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ వార్తను ఖండించని వంశీ పైడిపల్లి త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రోగ్రెస్ను వెల్లడిస్తామని చెప్పటం విశేషం.

ఇంతకీ కార్తీని తీసుకోవటానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ వింత ప్రవర్తన అనే మాటలు ఫిలింనగర్లో  గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రభస పరాజయంతో అయోమయంలో పడ్డ జూనియర్ ఈ మల్టీ స్టారర్ చిత్రంలో తన పాత్ర బాగాలేదని దర్శకుడు వంశీ పైడిపల్లికి చెప్పడంతో ఈ విషయం నాగార్జున వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ దశలో ఈ చిత్రానికి బ్రేక్ పడినట్లు కూడా రూమర్లు వచ్చాయి.  మరోవైపు  బృందావనం లాంటి సూపర్ హిట్ సినిమాను ఇచ్చిన వంశీ పైడిపల్లి లాంటి దర్శకుల స్క్రిప్ట్ లో కూడా జూనియర్ తన అత్యుత్సాహంతో మార్పులు చేర్పులు చేయాలంటుంటే... భవిష్యత్తులో జూనియర్‌తో  సినిమా తీయడానికి దర్శకులు భయపడతారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement