వేశ్యగా అనైక
నటి అనైక గుర్తుందా? సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దిగుమతి చేసిన హాట్ బ్యూటీ ఈ బాలీవుడ్ నటి. కావ్యతలైవన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఈ అమ్మడు తాజాగా ఒక చిత్రం కోసం సెక్స్ వర్కర్‌గా అవతారమెత్తారు. ఇవాళ వేశ్య పాత్రల్లో పోషించడానికి ప్రముఖ నటీమణులెవ్వరూ వెనుకాడటం లేదు. టాప్ హీరోయిన్ అనుష్కనే వేదం చిత్రం కోసం వేశ్యగా మారారు. శ్రీయ, చార్మి ఇలా చాలా మంది వేశ్య పాత్రలో జీవించిన వారే. తాజాగా అనైక ఈ కోవలోకి చేరారు.
నటుడు అధర్వ సొంతంగా నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సెమ బోధ అగాదు. బద్రి వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుభాష్‌ఘాయ్ కాంచి చిత్రం ఫేమ్ మిస్రి నాయకిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఒక కీలక పాత్రలో నటి అనైక నటిస్తున్నారు. ఆమె వేశ్య పాత్రను పోషిస్తున్నారు.ఏ ఇతర నటి నటించడానికి సాహసించని పాత్రను బోల్డ్ నటి అనైక చేయడానికి ముందుకొచ్చారని దర్శకుడు తెలిపారు.
చిత్రంలో గ్లామరస్ పాత్ర ఇదేనన్నారు. ఖుషి చిత్రంలో కట్టిపిడి కట్టిపిడిడా పాట తరహాలో సాగే గాలీ పన్నారేన్ అనే పల్లవితో కూడిన పాటలో అనైక నటించనున్నారని తెలిపారు. యువన్ శంకర్‌రాజా బాణీలు కట్టిన ఆ పాటను ఇటీవలే నటి రమ్యానంబీశన్‌తో పాడించినట్లు వెల్లడించారు. చిత్రంలో మొత్తం ఐదు పాటులు ఉంటాయన్నారు. రెండు పాటలు మినహా చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని దర్శకుడు చెప్పారు.