
ముంబై : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూ నటి తారా సుతరియా మర్జవాన్ మూవీ సహనటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాతో డేటింగ్‌లో ఉన్నట్టు వచ్చిన వార్తలపై నటి స్పష్టత ఇచ్చారు. సిద్ధార్ధ్‌తో తాను డేటింగ్ చేయలేదని, అతడు కేవలం తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని ఓ రేడియో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. తారా ఇటీవలే మర్జావన్ షూటింగ్‌ను ముగించారు.
‘మేం అసలు డేటింగ్‌లో లేము..సిద్ధార్ధ్ తన నెయిబర్ అంతకు మించి గొప్ప స్నేహితుడు..అంతే’ అని చెప్పారు. తాము సినిమాలతో పాటు అన్ని విషయాల గురించి ముచ్చటిస్తామని..అనన్యా పాండే, టైగర్ ష్రాఫ్ ఇలా ఎన్నో విషయాలు తమ మధ్య చర్చకు వస్తాయని అన్నారు. మరోవైపు ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలోనూ సిద్ధార్ధ్ మల్హోత్రతో తన అనుబంధంపై తారాను ప్రశ్నించగా తాము మంచి స్నేహితులు మాత్రమేనని ఆమె చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment