తెలుగులోకి... మదగజ రాజా
ఇటీవలే ‘జయసూర్య’ లాంటి క్రైమ్ థ్రిల్లర్‌తో మంచి విజయం సాధించిన విశాల్ ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్ష కులను అలరించడానికి సిద్ధమయ్యారు. సుందర్ సి దర్శకత్వంలో విశాల్, అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ (నటుడు శరత్‌కుమార్ కుమార్తె) హీరో హీరోయిన్లుగా రూపొం దిన తమిళ చిత్రం ‘మద గజ రాజా’(ఎం.జి.ఆర్)ని శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితి తెలుగులో అందించనున్నారు. ‘‘భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం కనువిందు చేస్తుంది.
తెలుగు టైటిల్‌ను త్వర లో ప్రకటిస్తాం. ఇందులో తమిళ హీరో ఆర్య అతిథి పాత్రలో మెరిశారు. ‘జిల్లా’ తర్వాత మేం అందిస్తున్న సినిమా ఇది’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, ఛాయాగ్రహణం: రిచర్డ్, సమర్పణ: జెమినీ ఫిలిం సర్క్యూట్.