
బాహుబలి లాంటి భారీ విజయం తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాహో. మరోసారి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉన్న సాహో టీంకు ఓ సౌత్ స్టార్ హీరో సర్‌ప్రైజ్ ఇచ్చాడట. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో సాహో షూటింగ్ జరుగుతుండగా తమిళ స్టార్ హీరో అజిత్ సెట్‌కు వచ్చి ప్రభాస్‌ను సర్‌ప్రైజ్ చేసినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం అజిత్ రామోజీ ఫిలిం సిటీలోనే పింక్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. పక్కనే సాహో షూటింగ్ జరుగుతుండటంతో విరామ సమయంలో కాసేపు సాహో యూనిట్ తో గడిపారు. అజిత్‌ను సెట్‌లోకి ఆహ్వానించిన ప్రభాస్ కొద్ది సేపు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి అజిత్‌తో మాట్లాడాడట. ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తున్న అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకు రాకుండా చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment