తెలంగాణ త్యాగాల వీణ | the songs cd of tyagala veena was released by KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణ త్యాగాల వీణ

Published Sun, Oct 9 2016 12:27 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

తెలంగాణ త్యాగాల వీణ - Sakshi

తెలంగాణ త్యాగాల వీణ

 ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని భావి తరాల వారికి అందించాలనుకోవడం శుభ పరిణామం. మంచి ఉద్దేశంతో ‘త్యాగాల వీణ’ చిత్రాన్ని రూపొందించినందుకు దర్శక-నిర్మాతలకు అభినందనలు. రమేష్ ముక్కెర సంగీతం వినసొంపుగా ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సుమన్, శివకృష్ణ, ప్రీతీ నిగమ్, మధుబాల ముఖ్య పాత్రల్లో మిర్యాల రవికుమార్ దర్శకత్వంలో కొత్తపల్లి సతీష్‌బాబు నిర్మించారు.

 రమేష్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని కేసీఆర్ విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల తాగ్యాలను గుర్తు చేసేదే ‘త్యాగాల వీణ’.  అంతర్జాతీయంగా పేరొందిన జానపద కళాకారుడు బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి నృత్య రీతులు  హెల్ప్ అయ్యాయి’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: చింతారెడ్డి వినోద్‌రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement